అభివృద్ధి పట్టించుకోని పార్టీలకు గుణపాఠం చెప్పాలి : నీలం మధు

by Disha Web Desk 23 |
అభివృద్ధి పట్టించుకోని పార్టీలకు గుణపాఠం చెప్పాలి : నీలం మధు
X

దిశ,జగదేవ్ పూర్: అభివృద్ధి పట్టించుకోని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెప్పాలని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసిందని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిలు పేర్కొన్నారు. సోమవారం జగదేవ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్నర్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు తూంకుంట నర్సారెడ్డిలు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తేదీ లోపు మాట ఇచ్చిన ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తారని, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని ఆగస్టు తర్వాత సిద్దిపేటకు ఉప ఎన్నిక రానుందని పేర్కొన్నారు.

మతం, ప్రాంతీయ వాదం తో ఓట్లు అడిగే నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ అంటేనే రామ్, రహీం, రాబర్ట్ అందరూ సమానమేనని తెలిపారు. మెదక్ పార్లమెంట్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వ పాలనలో దళితులకు భూములు, డబుల్ బెడ్ రూములు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ, ఎస్టీలకు అసైన్డ్ భూములతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి నరేందర్ రెడ్డి, హనుమంత రెడ్డి, జనార్దన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, అమర రాము, శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రెడ్డి, కనకయ్య గౌడ్, తిరుమల్ రెడ్డి, బాలకృష్ణ రెడ్డి, కొంపల్లి కరుణాకర్, రాగుల రాజు, బరిగే నర్సింహులు, జితేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed