నిర్లక్ష్యం వహిస్తున్న సొసైటీ అధికారులు.. రోడ్డుపై ఆందోళన చేపట్టిన రైతులు

by Anjali |
నిర్లక్ష్యం వహిస్తున్న సొసైటీ అధికారులు.. రోడ్డుపై ఆందోళన చేపట్టిన రైతులు
X

దిశ, నిజాంపేట: అకాల వర్షాలకు ధాన్యం పూర్తిగా తడుస్తున్నప్పటికీ అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేదని పలువురు రైతులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు రామాయంపేట మండల పరిధిలోని ప్రగతి ధర్మారం గ్రామంలో గురువారం వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద దాదాపు మూడు రోజుల నుండి వడ్ల కొనుగోలు జరగడంలేదని రైతులు ధర్నా చేస్తున్నారు. దీనిపై సంబంధిత సొసైటీ చైర్మన్, డైరెక్టర్లు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షానికి ధాన్యం తడవడం వల్ల తడిసిన ధాన్యాన్ని కొనడం లేరని ఆరోపించారు. ప్రభుత్వం తడిసిన ధన్యానైనా కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ కింది స్థాయి అధికారులు మాత్రం కొనడం లేరని ఆరోపించారు. రామాయంపేట - గజ్వేల్ ప్రధాన రహదారి పై వాహనాలు అడ్డుగా పెట్టి ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న రామాయంపేట పోలీసులు రైతులను సంముదాయించారు. దీనిపై సంబంధిత అధికారులు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed