బిగ్ బ్రేకింగ్: రష్యాకు భారీ షాక్.. UNO కీలక నిర్ణయం

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: రష్యాకు భారీ షాక్.. UNO కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా గత కొంతకాలంగా ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తోంది. బాంబులు, మిస్సైల్స్ దాడులతో ఇప్పటికే ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను ధ్వంసం చేసింది. దీనికి, ఉక్రెయిన్ సైన్యం కూడా ధీటుగా జవాబు ఇస్తుండటంతో రష్యా వెనక్కి తగ్గక తప్పడం లేదు. దీనితో తీవ్ర ఆగ్రహంలో ఉన్న రష్యా సైనికులు.. దారుణాలకు ఒడిగడుతున్నారు. ఉక్రెయిన్‌లోని చిన్న పిల్లలపై, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. సామాన్య పౌరులను చంపుతున్నారు. ఇటీవల బుచా‌ నగరంలో రష్యా చేసిన మారణహోమం ప్రపంచ దేశాలను తీవ్రంగా కలిచివేసింది. దీనితో రంగంలోకి దిగిన యూఎన్‌వోకి చెందిన మావన హక్కుల సంఘం రష్యాకు బిగ్ షాక్ ఇచ్చింది.

రష్యాకు వ్యతిరేకంగా UNO జనరల్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టింది. ఈ తీర్మానానికి మొత్తం 193 సభ్య దేశాల్లో 93 అనుకూలంగా ఓటు వేయగా.. 24 దేశాల వ్యతిరేకంగా ఓటు వేశాయి. మరో 58 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. భారత్ ఈ ఓటింగ్‌లో పాల్గొనకుండా తటస్థ వైఖరిని ప్రదర్శంచింది. ఈ ఓటింగ్‌లో మెజార్టీ దేశాలు అనుకూలంగా ఓటు వేయడంతో రష్యాను యుఎన్‌వో మానవ హక్కుల మండలి నుంచి సస్పెండ్ చేసింది. అంతేగాకుండా.. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపాలని ఇప్పటికే చాలా దేశాలు రష్యాపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ప్రపంచదేశాలు, UNO చెప్పిన రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీనితో UNO చర్యలకు దిగింది.


Next Story

Most Viewed