రష్యా ఆయిల్ డిపో పై ఉక్రెయిన్ దాడి!

by Disha Web Desk 17 |
రష్యా ఆయిల్ డిపో పై ఉక్రెయిన్ దాడి!
X

మాస్కో: రష్యా భూభాగంలో తొలిసారిగా ఉక్రెయిన్ దాడులు చేసింది. ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో బెల్గోరోడ్ తమ ఆయిల్ డిపో పై ఉక్రెయిన్ వైమానిక దాడులకు పాల్పడినట్లు శుక్రవారం రష్యన్ అధికారులు వెల్లడించారు. అయితే దీనిపై ఉక్రెయిన్ ఇప్పటి వరకు స్పందించలేదు. 'రెండు ఉక్రెయిన్ ఆర్మీ హెలికాప్టర్లు జరిపిన వాయు దాడుల్లో పెట్రోల్ డిపో‌లో మంటలు చెలరేగాయి. రష్యా భూభాగంలోకి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ చేరుకున్నాయి' అని బెల్గోరోడ్ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు డిపో సిబ్బంది గాయపడినట్లు చెప్పారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారని వెల్లడించారు.

మరోవైపు పెట్రోల్ డిపో పై దాడుల నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు వాహానాలతో ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద గుమిగూడారు. అయితే ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం ఉక్రెయిన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాగా, గత 37 రోజుల్లో రష్యా భూభాగంపై ఉక్రెయిన్ దాడులకు పాల్పడటం ఇదే తొలిసారి. రాడార్లకు చిక్కకుండా తక్కువ ఎత్తులో ప్రయాణించడంలో ఉక్రెయిన్ హెలికాప్టర్ పైలట్లకు అనుభవం ఉంది.



Next Story