- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి టీపీసీసీ డీఏసీ షోకాజ్ నోటీసు
టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి టీపీసీసీ డీఏసీ షోకాజ్ నోటీసు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) క్రమశిక్షణా చర్యల కమిటీ (డీఏసీ) కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది.

X
దిశ, కామారెడ్డి : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) క్రమశిక్షణా చర్యల కమిటీ (డీఏసీ) కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. డీఏసీ చైర్మన్, ఎంపీ డాక్టర్ మల్లు రవి, డీఏసీ ఉపాధ్యక్షుడు శ్యామ్ మోహన్ అనంతుల సంయుక్తంగా జారీ చేసిన నోటీసులో, కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలకు సంబంధించిన పత్రికా కథనాలు, అలాగే ఇతర పేలుడు పదార్థాలతో సంబంధించిన కేసు, మున్సిపాలిటీలోని పాత సామాను అమ్మిన కేసు, భూ కబ్జాలపై కేసు అలాగే అతనిపై దాదాపు 13 ఎఫ్ఐఆర్లు, 420 కేసులు ఆధారాలతో సహా వచ్చిన ఆరోపణలపై కమిటీ దృష్టికి వచ్చిన అంశాలను ప్రస్తావించారు.
అలాగే పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడి పై చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించాయనే ఆరోపణలు కూడా నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయి లిఖితపూర్వక వివరణను ఏడు రోజులలోగా.. 11 జూన్ 2026 లోపు డీఏసీకి సమర్పించాలని చంద్రశేఖర్ రెడ్డిని నోటీసు ద్వారా ఆదేశించారు. ఫిర్యాదులు, ప్రాతినిధ్యాల ప్రతులను కూడా నోటీసుకు జతచేసినట్లు టీపీసీసీ డీఏసీ వెల్లడించింది. వివరణ అందిన అనంతరం పార్టీ నియమ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలపై కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
Next Story






