- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rupee Value: అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి.. ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపాయి విలువ
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావంతో భారత కరెన్సీ రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది.

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావంతో భారత కరెన్సీ రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇవాళ ఇంట్రాడే ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 92 స్థాయిని తాకి చరిత్రలోనే సరికొత్త రికార్డు పతనాన్ని నమోదు చేసింది.
పతనానికి దారితీసిన కారణాలివే..
భారత స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) తమ నిధులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. కేవలం ఈ నెలలోనే రూ.వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించడంతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 65-67 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. చమురు దిగుమతుల కోసం భారత్ ఎక్కువ డాలర్లను ఖర్చు చేయాల్సి రావడంతో రూపాయి విలువ పడిపోతోంది. దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం రూపాయి పతానానికి కారణం అయ్యాయి.
సామాన్యుడిపై ప్రభావం..
రూపాయి పతనం కేవలం సామాన్యులపై కూడా ప్రభావం చూపనుంది. మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, విదేశీ యంత్రాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇంధన ధరలపై ప్రభావంతో రవాణా ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంది. అదేవిధంగా విదేశాల్లో చదువుకునే విద్యార్థులు చెల్లించే ఫీజులు భారం కానున్నాయి. అలాగే విదేశీ పర్యటనలు ప్లాన్ చేసే వారికి ఖర్చులు పెరగనున్నాయి.






