- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లైంగిక వేధింపులు భరించలేక తప్పుకున్నా.. సీనియర్ నటి
దిశ, సినిమా: ప్రముఖ టెలివిజన్ నటి రూపాలీ గంగూలీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సమస్యలపై ఓపెన్ అయింది. తండ్రి సపోర్టుతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టినా..Latest Telugu News

దిశ, సినిమా: ప్రముఖ టెలివిజన్ నటి రూపాలీ గంగూలీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సమస్యలపై ఓపెన్ అయింది. తండ్రి సపోర్టుతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టినా.. వ్యక్తిగతంగా పోరాటం చేయక తప్పలేదని వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ యాక్ట్రెస్.. ఫిల్మ్ మేకర్‌గా రాణించిన తండ్రి అనిల్ గంగూలీ కొన్ని సినిమాలకు డబ్బు పోగొట్టుకోవడంతో కుటుంబం సంక్షోభంలో కూరుకుపోయి వీధిన పడినట్లు తెలిపింది.
ఈ క్రమంలో కూలీ పనులు చేయాల్సి వచ్చిందన్న ఆమె.. రోజుకు రూ.180లతో అడ్జస్ట్ అయ్యామంటూ ఎమోషనల్ అయింది. అలాగే టెలివిజన్ నుంచి సినిమాల్లోకి రాకపోవడానికి కాస్టింగ్ కౌచ్ కారణమన్న రూపాలీ.. 'అప్పట్లో తెరవెనుక లైంగిక వేధింపులు ఎక్కువగా ఉండేవి. అలాంటి టార్చర్ నేను భరించలేను. నాన్న గౌరవాన్ని కాపాడాలే తప్ప పరువు తీయకూడదని ఫిక్స్ అయ్యాను. అందుకే ఆ సాహసం చేయలేదు. నా తండ్రి వైపు ఎవరూ వేలెత్తి చూపకుండా నడుచుకుంటానని మాటిచ్చాను' అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది.






