- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RTC Driver Shankar Goud : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్టు కంచన్ బాగ్ DRDO అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్ : నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్టు కంచన్ బాగ్ DRDO అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. గురువారం ఆర్టీసీ సమ్మె సందర్భంగా శంకర్ నిప్పంటించుకొని ఆత్మహత్యా యత్నం చేసిన సంగతి తెలిసిందే. తొలుత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించగా.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. కాగా మార్గమధ్యంలోనే శంకర్ మృతి చెందగా.. అంబులెన్స్ సిబ్బంది CPR చేసి ప్రాణాలు పోశారు. అనంతరం హుటాహుటిన కంచన్ బాగ్ DRDO అపోలో ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందించినప్పటికీ.. పరిస్థితి విషమించి తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో శంకర్ మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు.
అయితే 80 శాతం బాడీ కాలిపోవడంతో శంకర్ ను బతికించేందుకు చేసిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదని వివరించారు. కాగా DRDO ఆసుపత్రికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శంకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక శంకర్ ను పరామర్శించేందుకు అర్థరాత్రి ఆసుపత్రికి వెళ్లిన కల్వకుంట్ల కవితను లోపలికి అనుమతించకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ఉదృతం అయిన నేపథ్యంలో నర్సంపేట డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న శంకర్‌గౌడ్, ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేందుకు జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ నర్సంపేట బస్టాండ్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. శంకర్ మృతి నేపథ్యంలో నేడు సమ్మె మరింత ఉదృతం అయ్యే అవకాశం ఉంది.






