- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాజ్యసభలో రాష్ట్ర విభజన పై ప్రధాని మోడీ వ్యాఖ్యలకు ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని మోడీ కాదు కేడి అంటూ సంచలన వాక్యాలు చేశారు. గురువారం సాయత్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం లో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. తెలంగాణ గురించి మోడీ మాటలతో ప్రధాన మంత్రిగా ఉన్న గౌరవం పోయిందన్నారు. కనకపు సింహాసనమున శునకము కూర్చుంది అన్న తీవ్ర వాక్యాలు చేసిన బాజిరెడ్డి. 7 ఏళ్లలో కేంద్రం నుంచి రెండు రాష్ట్రాలకు ఒక్క నయాపైసా ఇవ్వలేదు అన్నారు. సిగ్గు లేని వ్యక్తి మోడీకి 1969 నుంచి తెలంగాణ ఉద్యమం కొనసాగింది అనే విషయం తెలియదన్నారు.
తెలంగాణకు సుష్మా స్వరాజ్ సపోర్ట్ చేసిందని, మోడీ మాటలతో సుష్మా స్వరాజ్ ను కూడా అవమనించినట్లే అన్నారు. బీజేపీ నేతలు రోడ్లపైకి వచ్చి బరితెగించి మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీ నీ బహిష్కరించాడు అని తెలిపారు. బీజేపీ నేతలకు తెలంగాణ ప్రజలు గ్రామాల్లోకి వస్తె తగిన బుద్ధి చెపుతున్నారు అని హెచ్చరించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ ఏమీ ఇవ్వకున్నా అన్ని ఇచ్చినట్లు మాట్లాడుతున్నారు అని పేర్కొన్నారు. పిచ్చి కుక్కలు బీజేపీ లో తిరుగుతున్నాయన్నారు. ఇక నుంచి నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్, కేటీఆర్ వారి కుటుంబం తిట్టిన ఊరుకునేది లేదు అన్నారు.






