- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన బస్సులు
ఆర్టీసీ జేఏసీ, తెలంగాణ సర్కార్ మధ్య చర్చలు సఫలం అయిన సంగతి తెలిసిందే. దీంతో నేడు యధావిధిగా బస్సులు రోడ్డెక్కాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఆర్టీసీ జేఏసీ, తెలంగాణ సర్కార్ మధ్య చర్చలు సఫలం అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించగా.. నేడు యధావిధిగా బస్సులు రోడ్డెక్కాయి. దీంతో గత మూడు రోజులుగా బస్సులు లేక తిప్పలు పడిన ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ లభించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీ కార్మికుల 3 ప్రధాన డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులకు 11 శాతం వేతన సవరణ (PRC) ఇవ్వాలని, అలాగే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై విధివిధానాల కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో జేఏసీ నేతలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించగా.. నేటి ఉదయం మొదటి షిఫ్ట్ బస్సులు రాకపోకలు ప్రారంభించాయి.






