ఆర్టీసీ బస్సు బోల్తా

by Muthe.Rajitha |

నెల్లూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఆర్టీసీ బస్సు బోల్తా
X

దిశ, వెబ్ డెస్క్ : నెల్లూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగం మండలం కోలగట్ల సమీపంలో ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతపురం డిపోకు చెందిన ఈ బస్సు నెల్లూరు వైపు ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న ఒక లారీని తప్పించబోయి నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. రహదారి పక్కన ఉన్న పల్లపు ప్రాంతంలోకి బస్సు దూసుకెళ్లి బోల్తా పడటంతో అందులోని వారు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాలవ్వగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు మరియు హైవే పెట్రోలింగ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.మలుపుల వద్ద మరియు ఎదురుగా వచ్చే వాహనాలను గమనించే క్రమంలో డ్రైవర్ అప్రమత్తత కోల్పోవడమే దీనికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story