సోషల్ మీడియా ప్రభావం సమాజంపై చాలా ఎక్కువగా ఉంది.. ఆర్‌ఎస్‌ఎస్ యాక్టివిజం పెరగాలి: మోహన్ భాగవత్

by Malleboina Mahesh |

మంచి ఆశయం కోసం సోషల్ మీడియాలో ఆర్‌ఎస్‌ఎస్ 'యాక్టివిజం' పెరగాలి. 'తరుణ్ భారత్' శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భాగవత్ పిలుపు!

సోషల్ మీడియా ప్రభావం సమాజంపై చాలా ఎక్కువగా ఉంది.. ఆర్‌ఎస్‌ఎస్ యాక్టివిజం పెరగాలి: మోహన్ భాగవత్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాల ప్రచారంపై సంఘ్ కార్యకర్తలకు కీలక పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో (Social Media) కూడా సంఘ్ తన కార్యాచరణను పెంచాల్సిన అవసరం ఉందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ (RSS Chief Mohan Bhagwat) చెప్పుకొచ్చారు. గురువారం నాగ్‌పూర్‌లో జరిగిన మరాఠీ దినపత్రిక 'తరుణ్ భారత్' శతాబ్ది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి కాలంలో సోషల్ మీడియా ప్రభావం సమాజంపై చాలా ఎక్కువగా ఉందని, అందుకే ఒక మంచి లక్ష్యం కోసం (Good Cause) ఈ వేదికలపై ఆర్‌ఎస్‌ఎస్ తన క్రియాశీలక పాత్రను పోషించాలని సూచించారు.

సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని పిలుపు

సోషల్ మీడియాను ప్రజలు విరివిగా వాడుతున్నారని, అయితే దానిని కేవలం కాలక్షేపం కోసం కాకుండా సమాజ హితం కోసం మలుచుకోవాలని భాగవత్ పేర్కొన్నారు. సంఘ్ చేస్తున్న విస్తృతమైన సేవా కార్యక్రమాలను, భావజాలాన్ని ప్రజల్లోకి మరింత వేగంగా తీసుకెళ్లడానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఒక శక్తివంతమైన సాధనాలని ఆయన అభిప్రాయపడ్డారు. శతాబ్ద కాలంగా విలువలతో కూడిన జర్నలిజాన్ని అందిస్తున్న 'తరుణ్ భారత్' పత్రికను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.

Next Story