పార్టీ మార్పు వార్తలపై RS ప్రవీణ్ కుమార్ క్లారిటీ

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-16 07:35:02  IST  )

పార్టీ మార్పు వార్తలపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.

పార్టీ మార్పు వార్తలపై RS ప్రవీణ్ కుమార్ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మార్పు వార్తలపై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘తెలంగాణ ప్రజలను పట్టపగలే మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఆ ప్రజాగ్రహం నుండి తప్పించుకోవడానికి యధావిధిగా మరో అటెన్షన్ డైవర్షన్ కుట్రకు తెరలేపారు. నా మీద సామాజిక మాధ్యమాల్లో పార్టీ మారుతున్నాను అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేయిస్తున్నారు. ఈ వార్తలను ప్రచారం చేయడం ఆపకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను. మళ్లీ గుర్తు చేస్తున్నా.. తెలంగాణలో అన్ని వర్గాల భవిష్యత్తు బీఆర్ఎస్‌తోనే భద్రంగా ఉంటదని నేను, ఆ పార్టీ అధికారంలో లేనప్పటికీ, అందులోనే చేరాను. నేటి సీఎం రేవంత్ రెడ్డి, నాడు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణను ఈ దోపిడీ కాంగ్రెస్ చెర నుండి విముక్తి చేసి, మళ్లీ అభివృద్ధి పథంలో పరిగెత్తించే ప్రస్థానంలో మడమ తిప్పేది లేదు. ఇప్పటికే తెలంగాణ చాలా నష్టపోయింది. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కొన్ని తరాలు నాశనం అవుతాయి’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

Read More..

Supreme Court: మీకిదే చివరి అవకాశం.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్‍కు సుప్రీం హెచ్చరిక

Next Story