Supreme Court: మీకిదే చివరి అవకాశం.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్‍కు సుప్రీం హెచ్చరిక

by Prasad Jukanti |   (  Updated:2026-01-16 07:10:06  IST  )

పార్టీ ఫిరాయింపుల అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Supreme Court:  మీకిదే చివరి అవకాశం.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్‍కు సుప్రీం హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పెండింగ్ లో ఉన్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? మేమే నిర్ణయం తీసుకోవాలా?అని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మీకిదే చివరి అవకాశం ఇస్తున్నామని రెండు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే మేమే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ తీసుకున్న చర్యల అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ఇప్పటి వరకు స్పీకర్ ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై తీసుకున్న చర్యలను న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టుకు నివేదించారు. దీంతో మిగతా వారిపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించగా ఇందుకు అభిషేక్ సింఘ్వీ గడువు కోరారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు 4 వారాలల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఇప్పటికే స్పీకర్‍కు చాలా సమయం ఇచ్చామని ఇదే ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేసింది. ఇప్పుడు సకాలంలో నిర్ణయం తీసుకోకుంటే కీలక పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు రాగా వారిలో అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యదయ్యకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో దానం నాగేందర్ విషయంలో స్పీకర్ వేటు తప్పపదనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గడ్డం ప్రసాద్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read More..

TG: మరికాసేపట్లో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంలో తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ

Next Story