భగీరథ్‌ను రక్షించేదే రేవంత్ : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్

by Muthe.Rajitha |

బండి భగీరథ్‌ను రక్షించాలన్నదే రేవంత్‌రెడ్డి ఆలోచన అన్నట్లు కనిపిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.

భగీరథ్‌ను రక్షించేదే రేవంత్  : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బండి భగీరథ్‌ను రక్షించాలన్నదే రేవంత్‌రెడ్డి ఆలోచన అన్నట్లు కనిపిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. చట్టానికి వ్యతిరేకంగా బండి భగీరథ్ మామకు పోలీసులు నోటీసులు ఇచ్చారని అన్నారు. భగీరథ్‌కు నేర చరిత్ర ఉన్నదని.. తెలంగాణ మహిళా లోకానికి అతనితో ప్రమాదం పొంచి ఉన్నదని అన్నారు. భగీరథ్‌పై నమోదు అయిన పోక్సో కేసుపై పోలీసులు మీడియా సమావేశం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. సీతక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసి మహిళా లోకానికి తెలియజేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలి తల్లి తనతో మాట్లాడి ఆవేదనతో కొన్ని విషయాలు చెప్పుకున్నారని.. బాధితురాలి వ్యక్తిత్వాన్ని అడుగడుగునా నాశనం చేయాలని చూస్తున్నారని అన్నారు.

ఆమెపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రితో కొట్లాట చేస్తాననని ఆమె తనతో చెప్పిందన్నారు. మంత్రులు సీతక్క, కొండ సురేఖ డీజీపీతో మాట్లాడి బాధితురాలి ఫొటోలను సోషల్ మీడియా నుంచి వెంటనే తీసివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టినప్పుడు తెలంగాణకు అమ్మలా ఉంటానని చెప్పి మర మనిషిగా ఉంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అమ్మలా ఉండాలని అనుకుంటున్న కవిత, బాధితురాలి తల్లి బాధ ఒకసారి చూడాలని సూచించారు. రేవంత్‌రెడ్డి, బీజేపీ స్క్రిప్ట్ చదవి మర మనిషిలా మారిపోయారన్నారు.

బీఆర్ఎస్ నాయకుల వల్లే బాధితురాలి వివరాలు బయటకు వచ్చాయని కవిత అనడం సరికాదని సూచించారు. ఒక సీనియర్ పోలీస్ అధికారి సలహా వల్లే బండి భగీరథ్ కరీంనగర్‌లో బాధితురాలిపై కేసు పెట్టారని.. సంజయ్ పెంపకంలో తేడా ఉన్నదని అన్నారు. బాధితురాలిపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలకు రక్షణ లేదన్నారు.

Next Story