అమ్మాయి పుడితే రూ. లక్ష డిపాజిట్.. తమిళనాడు ఎన్నికల్లో హామీల జల్లులు

by Muthe.Rajitha |

తమిళనాడు ఎన్నికల్లో హామీల జల్లు కురుస్తోంది.

అమ్మాయి పుడితే రూ. లక్ష డిపాజిట్.. తమిళనాడు ఎన్నికల్లో హామీల జల్లులు
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు ఎన్నికల్లో హామీల జల్లు కురుస్తోంది. నేడు వీరపట్టణం ప్రాంతంలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగసామి ఎన్నికల ప్రచారంలో పాల్గొని.. తమ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో ఆడబిడ్డ పుట్టిన వెంటనే ప్రభుత్వం తరఫున చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో ఆడబిడ్డ పుడితే ప్రభుత్వం రూ. 50,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తోంది. అయితే, రాబోయే కాలంలో ఈ మొత్తాన్ని రూ. 1,00,000 కు పెంచుతామని సీఎం రంగసామి ప్రకటించారు. ఈ నగదు ఆడపిల్లలు పెద్దయ్యాక వారి ఉన్నత చదువులకు, ఇతర అవసరాలకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ఈ 'లక్ష రూపాయల' హామీ స్థానిక ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.

Next Story