- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను నెక్స్ట్ సూపర్ స్టార్‌ని అనట్లేదు.. జయకృష్ణ ఘట్టమనేని
నేను నెక్స్ట్ సూపర్ స్టార్‌ని అనట్లేదు.. ఇంకా నిరూపించుకోవాల్సింది చాలా ఉంది అంటూ జయకృష్ణ ఘట్టమనేని వినయంగా స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. దీంతో ఆయన అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని ఘట్టమనేని అభిమానులు ఆశిస్తున్నారు. ఆయన తొలి చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం నిర్వహించిన మీడియా సమావేశంలో జయకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఓ పాత్రికేయుడు.. మీ తాత సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా వెలుగొందారు. ఆయన కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలోనే మీ తండ్రి రమేష్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చారు. అలాగే మీ బాబాయి మహేష్ బాబు కూడా స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఘట్టమనేని కుటుంబం నుంచి మీరు హీరోగా వస్తున్నారు.
ఈ విషయంపై మీ భావన ఏమిటి? అని ప్రశ్నించారు. దీనికి జయకృష్ణ స్పందిస్తూ.. మా తాతగారు, మా బాబాయ్ ఇద్దరూ సూపర్ స్టార్లు. కానీ నేను ఇంకా ఆ స్థాయికి చేరలేదు. అందుకే నన్ను నేను నిరూపించుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్నాననే కారణంతో మా తాతగారు, బాబాయ్ అభిమానులందరూ నాకు అండగా నిలుస్తున్నారు. అయితే వారి స్థాయికి చేరుకోవాలంటే నేను ఇంకా ఎంతో కష్టపడాలని అన్నారు. జయకృష్ణ ఎంతో వినయంగా, పరిణతి చెందిన ఆలోచనతో మాట్లాడిన ఈ మాటలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఆయన స్పీచ్‌పై అభిమానులతో పాటు సినీ వర్గాల నుంచి కూడా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.






