- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, దుబ్బాక: రైతుల సంక్షేమమే ద్యేయంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. తొగుట వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి మంత్రి హరీష్ రావు సహకారంతో రూ.40 లక్షలు మంజూరు చేయించి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడీల అనితా లక్ష్మా రెడ్డికి ప్రొసీడింగ్‌ను అందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు రైతులను కానీ, రైతు అవసరాలను కానీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. గతంలో లేని విధంగా పెద్ద ఎత్తున మార్కెట్ గోదాముల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, చెరువు కుంటల పునరుద్ధరణ, రైతు బీమా, రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్, పంట తీరువా రద్దు, రుణమాఫీ లాంటి కార్యక్రమాలు రైతుల జీవితాల్లో పెను మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు.
మార్కెట్ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడీల అనితా లక్ష్మా రెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంరెడ్డి, సొసైటీ చైర్మన్ కె హరికృష్ణ రెడ్డి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు బోధన్ కనకయ్య, సర్పంచ్లు సిరినేని గోవర్ధన్ రెడ్డి, తోయేటి ఎల్లం, ఎంపీటీసీ వేల్పుల స్వామి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.






