'రామాయణ'.. ప్రమోషన్లకే రూ.375 కోట్లు

by Muthe.Rajitha |

భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త సంచలనాలకు నాంది పలుకుతూ ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా రూ. 4 వేల కోట్ల అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అపూర్వ దృశ్యకావ్యం 'రామాయణ'.

రామాయణ.. ప్రమోషన్లకే రూ.375 కోట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త సంచలనాలకు నాంది పలుకుతూ ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా రూ. 4 వేల కోట్ల అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అపూర్వ దృశ్యకావ్యం 'రామాయణ'(Ramayana). హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, కళ్ళు చెదిరే ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నిర్మాణంలోనే కాకుండా, ప్రమోషన్ల విషయంలోనూ భారతీయ సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకెళ్లేందుకు మేకర్స్ అసాధారణమైన ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి.

ఈ సినిమా అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ (International Distribution) హక్కులను ప్రముఖ హాలీవుడ్ సంస్థ సోనీ పిక్చర్స్ (Sony Pictures) దక్కించుకోగా, కేవలం ప్రమోషన్ల కోసమే ఏకంగా రూ. 375 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం. అందులోనూ కేవలం నిర్మాతల (Makers) వాటానే రూ. 140 కోట్ల వరకు ఉంటుందని టాక్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూలన ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రీచ్ చేయడానికే ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ చలనచిత్ర రంగంలో ఒక సినిమా ప్రమోషన్ల కోసం ఈ స్థాయిలో భారీ బడ్జెట్‌ను కేటాయించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది.

Next Story