- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం.. జంతర్ మంతర్ దారులన్నీ మూసివేత
ఢిల్లీలో విద్యార్థులు, CJP నిరసనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP), విద్యార్థులు చేస్తున్న నిరసనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించడం సంచలనంగా మారింది. నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే నిరసనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో జంతర్ మంతర్ వైపు వెళ్లే ప్రధాన రహదారులన్నింటినీ మూసివేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ చర్యలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. CJP సోషల్ మీడియా వేదికగా "వాట్ ఏ షేమ్" అంటూ మండిపడింది. విద్యార్థులకు నిరసన ప్రదేశంలో అందుతున్న ఆహారం, తాగునీరు, అత్యవసర వైద్య సహాయం వంటి ప్రాథమిక సదుపాయాలు అందకుండా అడ్డుకోవడానికే ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలకు దిగుతోందని సీజేపీ నాయకులు ఆరోపించారు.
తగ్గేదే లేదు అంటున్న 'కాక్రోచ్'లు
అయితే ఎన్ని ఆంక్షలు విధించినా, రహదారులు మూసివేసినా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళనలను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం సీజేపీ ప్రతినిధులు చేశారు. ఇక ఈ పోరాటంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి జంతర్ మంతర్ వైపు వస్తున్న విద్యార్థులు, యువత, మద్దతుదారులు అప్రమత్తంగా ఉండాలని సీజేపీ విజ్ఞప్తి చేసింది. పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలు, మూసివేసిన మార్గాలను గమనించి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిరసన ప్రదేశానికి చేరుకోవాలని సూచించింది. పారదర్శకమైన విద్యా వ్యవస్థ కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం సాగుతున్న ఈ పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చింది.






