- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశ సరిహద్దు గ్రామాలకు కొత్త వెలుగులు.. 'వైబ్రెంట్ విలేజెస్' కోసం రూ. 3,431 కోట్లు
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్' (VVP) లోక్ సభలో వచ్చిన ప్రశ్నకు మంత్రి నిత్యానంద రాయ్ క్లారిటీగా సమాధానం ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్' (VVP) లోక్ సభలో వచ్చిన ప్రశ్నకు మంత్రి నిత్యానంద రాయ్ క్లారిటీగా సమాధానం ఇచ్చారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేంద్ర చేపట్టిన VVP శరవేగంగా దూసుకుపోతోందని, సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను పెంచడం ద్వారా వలసలను నిరోధించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఆయన సభలో నివేదిక పెట్టారు.
VVP-I ఉత్తర సరిహద్దులపై దృష్టి
ఫిబ్రవరి 15, 2023న ఆమోదించబడిన మొదటి దశలో, చైనాతో సరిహద్దులు పంచుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో గల 46 బ్లాకులను ఎంపిక చేశారు. మొదటి విడతలో భాగంగా 662 గ్రామాలను అత్యంత ప్రాధాన్యతతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. హోం మంత్రిత్వ శాఖ, ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖల సమన్వయంతో మొత్తం రూ. 3,431 కోట్ల వ్యయంతో 2,558 ప్రాజెక్టులకు ఆమోదం లభించినట్లు హోంశాఖ నివేదికలో మంత్రి స్పష్టం చేశారు.
VVP-II ఇతర అంతర్జాతీయ సరిహద్దులకు విస్తరణ
దేశ సరిహద్దు గ్రామాల అభివృద్దితో ఈ పథకం యొక్క విజయాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 2న రెండో దశను (VVP-II) ఆమోదించిందని, ఉత్తర సరిహద్దులు కాకుండా, ఇతర అంతర్జాతీయ భూ సరిహద్దులు కలిగి ఉన్న 15 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని బ్లాకులను ఇందులో చేర్చారని మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు. ఈ రెండో దశలో ఏకంగా 1,954 గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గుర్తించిందన్నారు.
సరిహద్దు గ్రామాలకు భద్రతా కవచం
'వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 1, 2 ద్వారా సరిహద్దు గ్రామాల అభివృద్ధి కేవలం ఆర్థిక పురోగతి కోసమే కాకుండా, వ్యూహాత్మకంగా కూడా చాలా ముఖ్యం. సరిహద్దుల్లో రోడ్లు, టెలికాం, పర్యాటకం, విద్య, వైద్య సదుపాయాలు మెరుగుపడటం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. తద్వారా సరిహద్దు రక్షణలో స్థానికులు భద్రతా బలగాలకు మరింత సహకారం అందించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నిత్యం భారత్ లోకి చొరబడాలని ప్రయత్నించే ఉగ్రవాదులు, రోహింగ్యాలకు చెక్ పెట్టడం భారత బలగాలకు ఈజీ అవుతుంది.






