'ఆర్‌ఆర్‌ఆర్' ఖాతాలో మరో అరుదైన ఘనత!

by Disha Web Desk 2 |
ఆర్‌ఆర్‌ఆర్ ఖాతాలో మరో అరుదైన ఘనత!
X

దిశ, సినిమా : 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ విడుదలై నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ఏదో ఒక రికార్డ్ సృష్టిస్తూ ఇప్పటికీ వార్తల్లో నిలుస్తోంది. ఇదే క్రమంలో తాజాగా మరో అరుదైన ఘనత సొంతం చేసుకుంది. హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌(HCA) అవార్డులకు 'ఆర్‌ఆర్‌ఆర్' నామినేట్‌ అయింది. ఈ అవార్డు కోసం మరో 9 పాపులర్‌ హాలీవుడ్‌ సినిమాలతో పోటీ పడనుంది. టామ్‌ క్రూజ్‌ మూవీ 'టాప్‌ గన్‌ మావెరిక్‌, ద బ్యాట్‌మ్యాన్‌ ఎల్విస్‌, ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌, ది నార్త్‌మ్యాన్‌, టర్నింగ్‌ రెడ్‌, చా చా రియల్‌ స్మూత్‌' వంటి ఇంగ్లిష్‌ సినిమాలతో పోటీకి సిద్ధంగా ఉంది. గతంలో ఏ ఇండియన్‌ మూవీ కూడా ఈ అవార్డులకు నామినేట్‌ కాలేదు. కాగా ఈ విషయాన్ని 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ టీమ్ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లోనూ మోస్ట్‌ పాపులర్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచిన 'ఆర్‌ఆర్‌ఆర్'.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే.

Next Story