టీయూసీఐలో చేరిన పెంకు కార్మికులు

by Ratna Kumari |

ఇల్లెందు మండలం ముకుందాపురం క్యాంపు సెంటర్‌లో ఆదివారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన పెంకు కర్మాగారాల్లో పనిచేస్తున్న సుమారు 100 మంది కార్మికులు తెలంగాణ పెంకు కార్మికుల సంఘాన్ని వీడి టీయూసీఐలో చేరారు.

టీయూసీఐలో చేరిన పెంకు కార్మికులు
X

దిశ, ఇల్లెందు : ఇల్లెందు మండలం ముకుందాపురం క్యాంపు సెంటర్‌లో ఆదివారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన పెంకు కర్మాగారాల్లో పనిచేస్తున్న సుమారు 100 మంది కార్మికులు తెలంగాణ పెంకు కార్మికుల సంఘాన్ని వీడి టీయూసీఐలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, పాయం చిన్న చంద్రన్న, కొత్తపల్లి రవి, షేక్ యాకూబ్ షావలి తదితరులు కార్మికులకు పార్టీ కండువాలు కప్పి టీయూసీఐలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అమరుడు ముక్తార్ పాషా జీవితాంతం పోరాటం చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక నియమావళిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం వాటిని రాష్ట్రంలో అమలు చేయవద్దని కోరారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక, రైతు, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు, పెంకు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story