"ఇదే నా చివరి వరల్డ్ కప్" : రోనాల్డో సంచలన ప్రకటన

by Muthe.Rajitha |

ప్రస్తుతం జరుగుతున్న 2026 ఫిఫా ప్రపంచకప్ తన కెరీర్‌లోనే చివరి వరల్డ్ కప్ అని పోర్చుగల్ కెప్టెన్, స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో స్పష్టం చేశాడు.

ఇదే నా చివరి వరల్డ్ కప్ : రోనాల్డో సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం జరుగుతున్న 2026 ఫిఫా ప్రపంచకప్ (2026 FIFA World Cup) తన కెరీర్‌లోనే చివరి వరల్డ్ కప్ అని పోర్చుగల్ కెప్టెన్, స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) స్పష్టం చేశాడు. తన సుదీర్ఘమైన, అద్భుతమైన కెరీర్‌లో ఆరోసారి ప్రపంచకప్ ఆడుతున్న రొనాల్డో.. ఎలాగైనా ఈసారి టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగా సోమవారం (భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటలకు) డల్లాస్‌లో జరిగే రౌండ్ ఆఫ్ 16 (Round of 16) మ్యాచ్‌లో పోర్చుగల్ జట్టు స్పెయిన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రొనాల్డో మాట్లాడుతూ.. "ప్రస్తుతానికి భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. ఈ ప్రపంచకప్ ముగిసిన తర్వాత, మనం గెలిచినా లేదా ఓడిపోయినా.. నా కుటుంబంతో మాట్లాడి ప్రశాంతంగా నిర్ణయం తీసుకుంటాను.

నేను ఇప్పుడు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోను" అని తెలిపాడు. కాగా మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్ జట్లతో కలిసి ఆరుసార్లు ఛాంపియన్స్ లీగ్ గెలిచిన రొనాల్డో.. పోర్చుగల్ తరఫున 2016లో యూరో కప్ కూడా సాధించాడు. అయితే, ఆయన అద్భుతమైన కెరీర్ లో లేని ఏకైక పెద్ద కప్ 'ప్రపంచకప్' మాత్రమే. మరి తన చివరి వరల్డ్ కప్‌లో రొనాల్డో ఈ కలని నెరవేర్చుకుంటాడో లేదో చూడాలి.

Next Story