హార్మూజ్ దాటిన భారత ఎరువుల నౌకలు

by Muthe.Rajitha |

పశ్చిమాసియాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండటంతో భారత్ కు వస్తున్న ఎరువుల నౌకలు సేఫ్ గా హార్మూజ్ జలసంధిని దాటినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

హార్మూజ్ దాటిన భారత ఎరువుల నౌకలు
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో అమెరికా -ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండటంతో భారత్ కు వస్తున్న ఎరువుల నౌకలు సేఫ్ గా హార్మూజ్ జలసంధిని (Strait of Hormuz) దాటినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత వ్యవసాయ రంగానికి ఊరటనిచ్చేలా ఎరువులు, ముడిసరకులతో కూడిన 15 నుంచి 20 భారీ నౌకలు సురక్షితంగా మనదేశం వైపు వస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ అధికారికంగా వెల్లడించింది.

ఏయే నౌకల్లో ఎంతెంత సరకు?

కేంద్ర మంత్రిత్వ శాఖ అందించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం వస్తున్న నౌకల్లో దేశానికి సాగు సీజన్‌లో అత్యంత కీలకమైన రసాయన ఎరువులు భారీ పరిమాణంలో ఉన్నాయి. ఎనిమిది నౌకల ద్వారా మొత్తం 3.32 లక్షల టన్నుల యూరియా, నాలుగు నౌకల్లో 2.57 లక్షల టన్నుల డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP), మరో మూడు నౌకల ద్వారా 1.11 లక్షల టన్నుల సల్ఫర్‌ను భారత పోర్టులకు తీసుకువస్తున్నారు. ఇవే కాకుండా, మరికొద్ది రోజుల్లో మరో ఐదు ఎరువుల నౌకలు కూడా భారత తీరానికి రానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిలో ఒక్కో నౌక ద్వారా విడివిడిగా 25 వేల టన్నుల అమ్మోనియా, అలాగే 45 వేల టన్నుల యూరియా దేశానికి అందనున్నట్లు కేంద్రం పేర్కొంది. ప్రస్తుత సాగు సమయానికి ఈ ఎరువుల దిగుమతి ఎంతో కీలకం కానుండటంతో, వీలైనంత త్వరగా వీటిని భారతీయ పోర్టుల నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా చేయడానికి రవాణా యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

Next Story