'సింగం 3'లో పోలీస్ పవర్ చూపిస్తాం.. రోహిత్ నుంచి బిగ్ అప్‌డేట్

by Disha Web Desk 7 |
సింగం 3లో పోలీస్ పవర్ చూపిస్తాం.. రోహిత్ నుంచి బిగ్ అప్‌డేట్
X

దిశ, సినిమా : బీటౌన్ యంగ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి 'సింగం' అభిమానులకు బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు. త్వరలోనే అజయ్ దేవ్‌గన్ హీరోగా తెరకెక్కనున్న 'సింగం 3' ప్రిపరేషన్ వర్క్ ప్రారంభించబోతున్నట్లు తెలిపాడు. 'మేము ఇప్పటికే 'సింగం 3' కోసం కసరత్తులు ప్రారంభించాం. నేను ఔట్‌ అండ్ ఔట్ యాక్షన్ ఫిల్మ్ చేసి చాలా రోజులైంది. అజయ్ సర్ తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. నేను 'సర్కస్‌'తో ఉండిపోయా. కాబట్టి వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 'సింగం 3' షూటింగ్ మొదలవుతుంది. ఇప్పటివరకు మేము రూపొందించిన పోలీస్ స్టోరీల్లో ఇదే అతిపెద్ద సినిమా అవుతుంది' అంటూ అధికారికంగా అనౌన్స్ చేశాడు. అయితే ఈ చిత్రం గురించి మిగతా వివరాలేవీ వెల్లడించని రోహిత్.. ప్రస్తుతం మల్టీ స్టారర్‌ తీయడం చాలా కష్టంగా మారిందని, త్వరలోనే పవర్‌ఫుల్ ఉమెన్ పోలీస్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానంటూ మరో హింట్ ఇచ్చాడు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed