2027 వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ.. MS ధోని సంచలన వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

భారత క్రికెట్ జట్టులో సీనియర్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్, విరాట్ కోహ్లీలు ప్రస్తుతం భీకర ఫామ్‌లో కొనసాగుతున్న విషయం తెలసిందే.

2027 వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ.. MS ధోని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ జట్టులో సీనియర్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)లు ప్రస్తుతం భీకర ఫామ్‌లో కొనసాగుతున్న విషయం తెలసిందే. అయితే వారు ఇద్దరు 2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup) ఆడాలని ఇప్పటినుంచి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలెట్టారు. ఈ డిమాండ్ పై టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) స్పందిస్తూ.. వార్తల్లో నిలిచారు. 2027 ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడటంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ధోనీ మాట్లాడుతూ.. ఒక ఆటగాడికి వయస్సు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని, ఫిట్‌నెస్, ప్రదర్శన బాగున్నంత కాలం ఎవరైనా జట్టులో కొనసాగవచ్చని రోహిత్, విరాట్‌లకు మద్దతుగా నిలిచారు.

ఫిట్‌నెస్ ఉంటే చాలు.. వయస్సు ప్రామాణికం కాదు

యూట్యూబ్ యాంకర్ ధోనిని ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ.. "ఎవరైనా వచ్చే ప్రపంచ కప్ ఎందుకు ఆడకూడదు? నా దృష్టిలో వయస్సు అనేది ఒక క్రైటీరియానే కాదు. కేవలం ప్రదర్శన, ఫిట్‌నెస్ మాత్రమే ముఖ్యం" అని ధోనీ స్పష్టం చేశారు. అనుభవం గురించి మాట్లాడుతూ.. 30 ఏళ్ల వయసున్న వారు జట్టుకు ఎంతో అవసరమని, కేవలం 20-25 మ్యాచ్‌లు ఆడిన వారిని అనుభవజ్ఞులుగా పరిగణించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశం కోసం ఆడాలనే పట్టుదల ఉంటే వారిని ఎవరూ అడ్డుకోకూడదని, ఒకవేళ ఫిట్‌నెస్ లేకపోతే అప్పుడు జట్టు నుండి తొలగించవచ్చని ధోనీ కుండబద్దలు కొట్టారు.

విరాట్ 'విశ్వరూపం'.. రోహిత్ సిక్సర్లు

ఇదిలా ఉంటే రోహిత్, కోహ్లీ కాంబోకు క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక అభిమానులు ఉన్నారు. కేవలం వీరిద్దరి బ్యాటింగ్ చేసేందుకు మాత్రమే టీవీల ముందు కుర్చేనే అభిమానులు కూడా ఉంటారు. ఈ క్రమంలో గత సంవత్సరం మేలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, రోహిత్, విరాట్‌ల వన్డే ఫామ్‌పై తీవ్రమైన చర్చ జరుగుతోంది. అయితే గణాంకాలు చూస్తే విరాట్ కోహ్లీ అప్రతిహతమైన ఫామ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా సిరీస్ నుంచి ఇప్పటివరకు ఆడిన 9 వన్డేల్లో కోహ్లీ 88 సగటుతో 616 పరుగులు సాధించాడు. అందులో మూడు సెంచరీలు కూడా బాదారు. మరోవైపు రోహిత్ శర్మ కూడా 51.12 సగటుతో 409 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నారు. న్యూజిలాండ్ సిరీస్‌లో రోహిత్ కాస్త తడబడినా, దేశవాళీ క్రికెట్‌లో (విజయ్ హజారే ట్రోఫీ) రాణించి తన రిథమ్‌ను కాపాడుకుంటున్నారు.

ఇంగ్లాండ్ పర్యటనే రోహీత్, కోహ్లీలకు కీలకం..?

ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్ హడావుడి ముగిసిన తర్వాత, ఈ ఇద్దరు దిగ్గజాలు మళ్ళీ జూలై 14 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు తరపున బరిలోకి దిగనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జరిగే మూడు వన్డేల సిరీస్ రోహిత్, కోహ్లీలకు 2027 ప్రపంచ కప్ దిశగా అత్యంత కీలకం కానుంది. యువ ఆటగాళ్లకు తమ అనుభవాన్ని పంచుతూనే, తాము ఇంకా జట్టుకు భారంగా మారలేదని ఈ సీనియర్లు నిరూపించుకుంటున్నారు. దాదాపు 7 నెలల గ్యాప్ తర్వాత వీరు ఆడనుండటం తో వారి ఫామ్ ఎలా ఉంటుందో దానిపైనే 2027 వన్డే వరల్డ్ కప్ లో ఉంచలా, దించాలా నిర్ణయించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

Next Story