బౌద్ధ సన్యాసులుగా మారిన రోబోలు

by Muthe.Rajitha |

సౌత్ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన లోటస్ లాంతర్ ఫెస్టివల్ ఈసారి ఒక అద్భుతమైన విశేషానికి వేదికైంది.

బౌద్ధ సన్యాసులుగా మారిన రోబోలు
X

దిశ, వెబ్ డెస్క్ : సౌత్ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన లోటస్ లాంతర్ ఫెస్టివల్ (Lotus Lantern Festival) ఈసారి ఒక అద్భుతమైన విశేషానికి వేదికైంది. బుద్ధ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ సాంప్రదాయిక ఉత్సవంలో బౌద్ధ సన్యాసి వేషధారణలో ఉన్న రోబోలు పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచాయి. యునెస్కో గుర్తింపు పొందిన ఈ పరేడ్ లో సాంప్రదాయిక బౌద్ధ దుస్తులు ధరించి, ఆచారాలు, ప్రార్థనలు లాంతర్ల ప్రదర్శనలో ఈ రోబోలు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ రోబోలను కేవలం ప్రదర్శనకే పరిమితం చేయకుండా, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో రూపొందించడం విశేషం. ఇవి బుద్ధుని బోధనలు, జీవన సూత్రాలు, ధ్యాన పద్ధతుల గురించి భక్తులకు వివరించగలవు. దక్షిణ కొరియాలో బౌద్ధమత ప్రచారాన్ని నేటి తరం ఆధునిక సాంకేతికతతో ముడిపెట్టి సరికొత్తగా చూపించడానికి ఈ ప్రయోగం చేశారు. ఈ ఏడాది లోటస్ లాంతర్ ఫెస్టివల్‌లో రోబో సన్యాసులు ఈ విధంగా సందడి చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Next Story