ఆరేగూడెంలో దోపిడీ దొంగల హల్‌చల్.. తాళం వేసిన ఇండ్లలో చోరీ

by Jakkula.Mamatha |

వెల్దుర్తి మండలం అరేగూడెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు హల్ చల్ చేశారు.

ఆరేగూడెంలో దోపిడీ దొంగల హల్‌చల్.. తాళం వేసిన ఇండ్లలో చోరీ
X

దిశ,వెల్దుర్తి: వెల్దుర్తి మండలం అరేగూడెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు హల్ చల్ చేశారు. గ్రామంలో తాళాలు వేసి ఉన్న రెండు ఇండ్లలో తాళాలు పగలగొట్టి రూ.2 లక్షల సొత్తును దోచుకెళ్ళారు. గ్రామానికి చెందిన చాకలి భాగ్యమ్మ అలాగే ఏర్పుల నవీన్లు ఆదివారం తమ ఇండ్లకు తాళాలు వేసి ఊరెళ్ళారు. దీంతో గమనించిన దొంగలు అర్ధరాత్రి ఇళ్ల తాళాలు పగలగొట్టి నవీన్ ఇంట్లో పదివేల నగదుతో పాటు 60 తులాల వెండి కాళ్ల కడాలు, పట్ట గొలుసులు, బంగారు పుస్తెను ఎత్తుకెళ్లినట్లు నవీన్ బోరున విలపించారు. చాకలి భాగ్యమ్మ ఇంట్లో పదివేల నగదు, ఐదు తులాల వెండి గొలుసు దొంగలు దోచుకున్నట్లు భాగ్యమ్మ తెలిపారు.

Next Story