- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, ముధోల్ రూరల్: ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొట్టుకున్న ఘటనలోబాసరకు చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. భైంసా- బాసర ప్రధాన రహదారి మార్గంలోని ముథోల్ మండలం టాక్లి గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. ముథోల్ నుంచి బాసర వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అదే గ్రామానికి చెందిన వంశీ, సిహెచ్ నవీన్ లు, బాసర వైపు నుంచి భైంసా కి ద్విచక్రవాహనంపై వస్తున్న సాయికిరణ్ లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టుకున్నారు. ప్రమాదంలో బాసరకు చెందిన సిహెచ్ నవీన్ ప్రమాద స్థలంలో మృత్యువాత పడగా మిగతా ఇద్దరు సాయికిరణ్, వంశీలు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇందులో వంశీ ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా సాయి కిరణ్ ను భైంసా అసుపత్రికి తరలించారు.
Next Story






