కారు బైక్ ఢీ.. ఒకరి మృతి!

by Disha Web Desk 13 |
కారు బైక్ ఢీ.. ఒకరి మృతి!
X

దిశ, కొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలో బుధవారం కారు బైకు ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ సామ్య నాయక్ కథనం మేరకు పట్టణ కేంద్రంలో బైక్ మెకానిక్ గా పనిచేస్తున్న గుండ్లకుంట గ్రామానికి చెందిన నరేష్ (28) గత కొంత కాలంగా బైక్ మెకానిక్ షాప్ నడిపిస్తున్నాడు. అదే క్రమంలో ఓ వ్యక్తి బైక్ రిపేర్ కోసం రావడంతో బైక్‌ను తీసుకొని ట్రయల్ రన్ కోసం హైదరాబాద్ రోడ్డు వైపు వెళ్తున్న క్రమంలో రాయల్ కేఫ్ ముందర యూటర్న్ తీసుకునే సమయంలో పరిగి నుంచి కొడంగల్ వస్తున్న కారు AP-21AA-5698 బైక్‌ను ఢీకొనడంతో నరేష్ తలకు బలంగా తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తీసుకు వస్తుండగా మధ్యలోనే చనిపోయాడనీ ప్రత్యక్ష సాక్షి రమేష్ మెకానిక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు.


Next Story

Most Viewed