మెట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

by Jakkula.Mamatha |

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

మెట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
X

దిశ, మెట్ పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి ఉదయం 4 గంటలకు బయలుదేరింది. మెట్‌పల్లి పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ బలమైన చెట్టును ఢీకొనడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవర్ నిద్రలోకి జారుకుని చెట్టును ఢీ కొట్టినట్లు తెలిపారు. ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మెరుగైన చికిత్స కొరకు జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.

Next Story