- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘శ్రీశ్రీ’ మ్యూజికల్ జర్నీ స్టార్ట్.. బొమ్మ బొమ్మ సాంగ్‌తో మాయ చేసిన దుల్కర్- పూజాహెగ్డే!
తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రం మ్యూజికల్ జర్నీని చాలా గ్రాండ్‌గా ప్రారంభించారు. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ‘బొమ్మ బొమ్మ’ పాటను విడుదల చేశారు.

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ , స్టార్ బ్యూటీ పూజా హెగ్డే మొదటిసారి జంటగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘శ్రీశ్రీ’. దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ,వర్కింగ్ స్టిల్స్ ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియాలో విశేషమైన ఆదరణను దక్కించుకున్నాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రం మ్యూజికల్ జర్నీని చాలా గ్రాండ్‌గా ప్రారంభించారు. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ‘బొమ్మ బొమ్మ’ పాటను విడుదల చేశారు.
ఈ పాట విజువల్స్ ఎంతో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా చాలా అందంగా ఉన్నాయి. ఒక రైల్వే స్టేషన్‌లో ఓ బెంచ్‌పై కూర్చున్న దుల్కర్ సల్మాన్.. ప్లాట్‌ఫామ్‌పైకి నడుచుకుంటూ వచ్చిన పూజా హెగ్డేను తొలిసారి చూసిన క్షణంలోనే ఆమె అందానికి ఫిదా అయిపోయి, వెంటనే ప్రేమలో పడే అద్భుతమైన సీన్స్‌తో ఈ మెలోడీ పాట ప్రారంభమవుతుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ తనదైన శైలిలో హృదయాన్ని హత్తుకునే అద్భుతమైన స్వరాలను ఈ పాటకు అందించారు. చాలా సింపుల్‌గా ఉంటూనే మైండ్ లోకి ఎక్కేసే మెలోడీ ట్యూన్‌కు క్లాసీ ఆర్కెస్ట్రేషన్ జోడించి పాటను మరింత స్పెషల్‌గా మార్చేశారు. ఇక ప్రముఖ రచయిత అనంత శ్రీరామ్ చాలా అర్థవంతమైన సాహిత్యం అందించగా, టాలెంటెడ్ గాయకుడు కపిల్ కపిలన్ తన మృదువైన గాత్రంతో ఈ పాటకు మరింత ప్రాణం పోశారు. దుల్కర్, పూజల మధ్య ఉన్న ఫ్రెష్ కేమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ సినీ ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది.






