- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ, తెలంగాణకు వర్షసూచన.. నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
by Ajay Maddhiboyina |
ఏపీకి నేడు, తెలంగాణకు నేడు, రేపు వర్షసూచన ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ఉత్తర దిశగా నెమ్మదిగా కదులుతుండటంతో ఏపీలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీకి నేడు, తెలంగాణకు నేడు, రేపు వర్షసూచన ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ఉత్తర దిశగా నెమ్మదిగా కదులుతుండటంతో ఏపీలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు నేడు, రేపు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, ఉత్తర తెలంగాణకు భారీ వర్షసూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
Next Story






