- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూరాల గేట్లు ఎత్తివేత.. శ్రీశైలానికి పెరుగుతున్న కృష్ణమ్మ వరద ప్రవాహం!
కృష్ణా నది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలపై ఎల్ నినో ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ.. కృష్ణా నది ఎగువన ఉన్న రాష్ట్రాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అలాగే గత వారం రోజులుగా ఈ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (Priyadarshini Jurala Project)కు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు తెరిచిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 32,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అంతే స్థాయిలో ప్రాజెక్టు నుంచి 30,700 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి ప్రవాహం క్రమంగా పెరుగుతుండడంతో దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
కాగా, కర్ణాటకలోని భీమా నది పరివాహక ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక పశ్చిమ కనుమల్లో (ఘాట్ ప్రాంతాల్లో) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణానదికి వరద మరింత పెరిగే అవకాశం ఉంది. భీమా నది నుంచి అదనపు ప్రవాహాలు జూరాలలో కలిసే అవకాశం ఉండటంతో నీటిమట్టం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి వల్ల శ్రీశైలం జలాశయ నీటిమట్టం వేగంగా పెరిగి, రాబోయే రోజుల్లో శ్రీశైలానికి మరింత భారీగా ఇన్‌ఫ్లోలు నమోదవుతాయని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.






