కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

by Jakkula.Mamatha |

ఎల్కతుర్తి నుంచి దామరకు వెళ్లే రోడ్డు పనులను కాంట్రాక్టర్ మధ్యలో నిలిపివేయడంతో ఇందులో మురుగునీరు నిలిచి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
X

దిశ, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి నుంచి దామరకు వెళ్లే రోడ్డు పనులను కాంట్రాక్టర్ మధ్యలో నిలిపివేయడంతో ఇందులో మురుగునీరు నిలిచి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. నాయకులు వారి దృష్టికి తీసుకువెళ్లగా, స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ చాహత్ బాజ్పేయి పరిశీలించి వారం రోజుల్లోగా వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వారం రోజుల తర్వాత అధికారులలో ఎలాంటి చలనం లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు మళ్లీ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె స్వయంగా వచ్చి పరిశీలించి ఇంత నిర్లక్ష్యం పనికిరాదు వెంటనే పనులు పూర్తి చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆమె వచ్చి వెళ్లి వారం గడుస్తున్నప్పటికీ, అక్కడ పరిస్థితి నేటికీ అలాగే ఉంది. చిన్నగా కురిసిన వర్షానికి నీరు నిలిచి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే కాకుండా అసంపూర్తిగా ఉన్న మురికి కాలువలో నీళ్లు నిలిచి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. పక్కనే ఉన్న కుటుంబాలకు ఇబ్బందులు ఎదురవుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. మంత్రి మాటకు విలువ లేదు, కలెక్టర్ మాటకు పట్టింపు లేదని, ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు.

Next Story