- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా... ఖమ్మంలో నేషనల్ మార్ట్..
వ్యాపార వాణిజ్య వస్త్ర వ్యాపార రంగాలలో ప్రజలకు సేవలు అందించడంలో హైదరాబాద్ నగరంతో ఖమ్మం పోటీ పడుతుంది.

దిశ, ఖమ్మం : వ్యాపార వాణిజ్య వస్త్ర వ్యాపార రంగాలలో ప్రజలకు సేవలు అందించడంలో హైదరాబాద్ నగరంతో ఖమ్మం పోటీ పడుతుందని, మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా ఖమ్మంలో నేషనల్ మార్ట్ హైపర్ మార్కెట్ సేవలు అందుబాటులోకి రావడం శుభప్రదమని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి, మాజీ మిస్సెస్ ఇండియా, హైకోర్టు న్యాయవాది, ఫిట్ ఇండియా అంబాసిడర్ డాక్టర్ మొహమ్మద్ ఫర్హా, ప్రముఖ యాంకర్ రీతు చౌదరి, డిమాన్ పవన్ లు అన్నారు.. బుధవారం ఖమ్మం నగరంలో నూతన నేషనల్ మార్ట్ హైపర్ మార్కెట్ సేవల కేంద్రం వారి ప్రారంభించి మాట్లాడారు.. నాణ్యమైన మన్నిక కలిగిన ఆహార సముదాయ వస్తువులన్నీ ఒకే చోట లభించడం సంతోషదాయకమని వారన్నారు.. ఈ పోటీ ప్రపంచంలో అన్ని రకాల ఆహార సముదాయ వస్తువులు ఒకచోట లభ్యం కావడంతో సమయం ఆదా అవుతుందని వినియోగదారులకు సౌలభ్యానికి ఈ నేషనల్ మార్ట్ చిరునామాగా నిలుస్తుందని వారన్నారు. ప్రజలకు నాణ్యమైన షాపింగ్ అనుభూతిని అందించేందుకు నేషనల్ మార్ట్ సేవలు ఖమ్మం కేంద్రంలో ఏర్పాటు కావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. అనంతరం నేషనల్ మార్ట్ ప్రతినిధి శ్రీ రహా మాట్లాడుతూ.. ఇది ఆల్-ఇన్-వన్ షాపింగ్ డెస్టినేషన్ అని, రూ.1,499 లేదా అంతకంటే ఎక్కువ షాపింగ్ చేసిన ప్రతి కస్టమర్‌కు ప్రతిరోజూ నిర్వహించే లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం ఉంటుందని, విజేతలు గోల్డ్ కాయిన్ గెలుచుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించు కోవాలని ఆయన కోరారు.






