- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐస్ హాకీ మ్యాచ్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
అమెరికా ఐస్ హాకీ మ్యాచ్‌లో కాల్పుల బీభత్సం. ముగ్గురు మృతి, నిందితుడి ఆత్మహత్య! కుటుంబ కలహాలే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ.

దిశ, వెబ్ డెస్క్: ఐస్ హాకీ మ్యాచ్‌లో గన్ తో వచ్చిన దుండుగుడు కాల్పులకు పాల్పడటంతో ముగ్గురు మృతి చెందారు. ఈ అనూహ్య ఘటన అమెరికాలోని పాతుకెట్ (Pawtucket) పట్టణంలో గల 'డెన్నిస్ ఎం. లించ్ ఎరీనా' ఐస్ హాకీ స్టేడియంలో చోటుచేసుకుంది. హైస్కూల్ విద్యార్థుల మధ్య ఐస్ హాకీ మ్యాచ్ జరుగుతుండగా, ఒక్కసారిగా గ్యాలరీ నుంచి కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఈ ఘటనలో నిందితుడితో సహా ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఇది ఒక కుటుంబ కలహాల (Family Dispute) కారణంగా జరిగిన దాడి అని తేలింది. నిందితుడు తన కుటుంబ సభ్యులనే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన అనంతరం, నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో స్టేడియంలో వందలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉండడం తో అందరూ భయాందోళన తో పరుగులు తీశారు.
ఈ కాల్పుల ఘటనలో మరణించిన వారిలో నిందితుడి భార్య, ఒక కుమార్తె ఉన్నట్లు కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ సంఘటనపై రోడ్ ఐలాండ్ గవర్నర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. నిందితుడు మహిళా వేషధారణలో వచ్చి ఈ దాడికి పాల్పడి ఉండవచ్చనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






