200 పెరిగి ఏకంగా 2,613కు చేరుకున్న రైనోల సంఖ్య

by Disha Web |
200 పెరిగి ఏకంగా 2,613కు చేరుకున్న రైనోల సంఖ్య
X

గువహటి: కజిరంగా జాతీయ పార్కులో ఒంటి కొమ్ము రైనోల సంఖ్య పెరిగినట్లు అధికారులు తెలిపారు. తాజాగా 200 పెరిగి ఏకంగా 2,613కు చేరినట్లు వెల్లడించారు. నాలుగు రోజులు పాటు రైనోల గణన చేసినట్లు మంగళవారం అధికారులు చెప్పారు. వీటిలో ఆరేళ్లు పైబడిన రైనోలలో 903 మగవి, 750 ఆడవి, 170 గుర్తించబడనివి ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా 3-6 ఆరేళ్ల మధ్యలో 146 ఆడవి, 116 మగవి మరో 103 లింగ నిర్ధారణ చేయనివి ఉన్నట్లు వెల్లడించారు. గతంలో 2018లో రైనోలు లెక్కించినపుడు 2,413 గా ఉన్నాయని తెలిపారు. మరోవైపు ఒరాంగ్ జాతీయ పార్క్‌లోనూ రైనోల సంఖ్య పెరిగినట్లు అధికారులు తెలిపారు. 2018లో 101 ఉండగా, తాజాగా 125 ఉన్నట్లు వెల్లడించారు.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed