డ్రగ్స్ కేసుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

by Dishanational2 |
డ్రగ్స్ కేసుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ డ్రగ్స్ కేసుపై రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'డేంజరస్' మూవీ ప్రమోషన్‌లో ఈ వివాదంపై స్పందించిన వర్మ.. 'టాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పోలిస్తే ఇది చాలా చిన్న ఇష్యూ. నిజం చెప్పాలంటే ఒక షార్ట్ ఫిల్మ్ మాదిరిగా అనిపిస్తోంది. ముంబైలో నా అసిస్టెంట్ డైరెక్టర్స్ టీ తాగినంత ఈజీగా డ్రగ్స్ తీసుకునేవారు. ఇది అత్యంత సాధారణ విషయం' అని అభిప్రాయపడ్డారు. తాను కూడా ఒకసారి డ్రగ్స్ తీసుకునేందుకు ప్రయత్నించానని వెల్లడించారు. అయితే తాను డ్రగ్స్ తీసుకోకపోయినా అంతకంటే ప్రమాదకరమైన పనులే చేస్తానని తెలిపారు. కాగా ఏప్రిల్ 2న ర్యాడిసన్ హోటల్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖుల పిల్లలు పేర్లు బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే టాపిక్‌పై ఆర్జీవీ చేసిన కామెంట్లు సోషల్‌‌మీడియాలో హాట్‌టాపిక్‌‌గా ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మారాయి.


Next Story

Most Viewed