చౌటుప్పల్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పరిశీలన

by Ratna Kumari |   (  Updated:2026-07-28 09:33:46  IST  )

ఎస్‌ఐఆర్‌ (ప్రత్యేక ఓటరు నమోదు) ప్రక్రియను నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పరిశీలించారు.

చౌటుప్పల్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పరిశీలన
X

దిశ, చౌటుప్పల్ టౌన్ : భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఎస్‌ఐఆర్‌ (ప్రత్యేక ఓటరు నమోదు) ప్రక్రియను నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పరిశీలించారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు, 39వ బూత్‌కు చెందిన బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ) బుచ్చి రాములును కలిసి ఓటరు నమోదు ప్రక్రియ ఎలా కొనసాగుతోందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఓటరిని గుర్తించి నమోదు చేయాలని సూచించారు.

అలాగే స్థానికేతరులు, అనర్హుల పేర్లను గుర్తించి తొలగించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరించాలని బీఎల్‌ఓలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్, జిల్లా కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు రమనగోని శంకరయ్య, ఫ్లోర్ లీడర్ బుడ్డ సురేష్, సీనియర్ నాయకులు గుజ్జుల సురేందర్ రెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ ఇన్‌చార్జి అనపర్తి యాదగిరి, ఆలే చిరంజీవి, పోలపల్లి ముత్తయ్య, కడవేరు పాండు, ధర్మోజిగూడెం ఉపసర్పంచ్ ఫకీర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ ఉపాధ్యక్షుడు గుండెబోయిన వేణు, బీఎల్‌ఏ-2 మారగోని గణేష్, అన్నమోని రాజేష్, బూత్ అధ్యక్షుడు పాశం భరత్, దండం సత్తిరెడ్డి, ఇటికాల దామోదర్ రెడ్డి, గుండపల్లి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story