- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"రేవంత్ రెడ్డి మాటలే అరాచకాలకు ప్రేరణ.. గజ్వేల్ దాడిపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్
గజ్వేల్ దాడిని ఖండించిన సబితా ఇంద్రారెడ్డి! రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే అరాచకాలకు కారణమని విమర్శ. ప్రశాంతమైన రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని ఆగ్రహం.

దిశ, వెబ్ డెస్క్: గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు జరిపిన దాడి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Indra Reddy) తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, ఆయన మాటలే కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా రెచ్చిపోవడానికి కారణమని ఆమె విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా "మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారు" అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అరాచకాలను, హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆమె మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి 'రౌడీ' మాటలు మాట్లాడటం ప్రజాస్వామ్యానికి చేటు అని ఆమె హితవు పలికారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణలో శాంతిభద్రతలు అదుపులో ఉండేవని, ప్రతి ప్రాంతంలో ప్రజలు ప్రశాంతంగా అభివృద్ధి చేసుకున్నారని సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మూలకు చూసినా సామాన్యుల భూములు లాక్కోవడం, ఇండ్లు కూలగొట్టడం వంటి అరాచకాలు నిత్యకృత్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలపై పట్టపగలే దాడులు జరుగుతుంటే పోలీసులు మౌనంగా ఉండటం శోచనీయమని, ఈ దాడికి ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగమే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు.






