ముఖ్యమంత్రి పదవిపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-17 11:07:18  IST  )

జడ్చర్ల మండలం చిట్టెబోయినపల్లిలో మహబూబ్‌నగర్‌ ట్రిపుల్‌ఐటీ (IIIT) క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు.

ముఖ్యమంత్రి పదవిపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జడ్చర్ల మండలం చిట్టెబోయినపల్లిలో మహబూబ్‌నగర్‌ ట్రిపుల్‌ఐటీ (IIIT) క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భూమి పూజ చేశారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. బూర్గుల రామకృష్ణారావు తరవాత దాదాపు 75 ఏళ్లకు మహబూబ్ నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లాకు విద్యా, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏ సమస్యకు అయినా విద్యే పరిష్కారం చూపుతుంది. దీనిని నేను బలంగా నమ్ముతాను. ప్రతీ విద్యార్థి భాషను మెరుగు పరుచుకోవాలి. తాజా పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి. జీవితంలో పైకి రావాలంటే పట్టుదలతో కష్టపడి పనిచేయాలి. అచ్చంపేట నియోజకవర్గంలోని ఓ మారుమూల పల్లె నుంచి వచ్చాను. రాజకీయాల్లోకి వచ్చిన 17 ఏళ్లకే ముఖ్యమంత్రి అయ్యాను. మంత్రి కాకపోయినా అందరి సహకారంతో సీఎం అయ్యాను. ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతోనే రాష్ట్రాని ముందుకు తీసుకువెళ్తున్నాం.

చదువు వల్లనే అవకాశాలు

గతంలో భూమి లేని నిరుపేదలకు, ఆదివాసి, గిరిజన దళితులకు భూములు పంచారు. ఇప్పుడు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కూడా భూమి లేదు. విద్యా ఒక్కటే మార్గం. విద్యలో రాణినించాలి. అందుకే ప్రజా ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నాం. చదువు వల్లనే అవకాశాలు వస్తాయి. భవిష్యత్ కూడా చదువు మీద ఆధారపడి ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లాకు అన్ని విద్యా సంస్థలు తీసుకు వస్తున్నాం. నిబద్ధత లేని చదువు జీవితానికి ఉపయోగం ఉండదు. చదువే సమాజంలో గౌరవం తీసుకువస్తుంది. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేవారికి కూడా కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఈ ఏడాదే ఐఐఐటీ భవనం పూర్తి చేస్తాం. తల్లి తండ్రులను అందరూ గౌరవించుకోవాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Read More... తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఏ స్థాయిలో ఉన్నా వేస్ట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Next Story