- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఏ స్థాయిలో ఉన్నా వేస్ట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సీఎం రేవంత్ రెడ్డి నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో సీఎం జడ్చర్ల మండలం చిట్టెబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో సీఎం జడ్చర్ల మండలం చిట్టెబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ స్థాయికి ఎదిగినా తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వనివాళ్లు, తల్లిదండ్రును సరిగా చూసుకోకపోతే నిష్ప్రయోజనమే అన్నారు. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్నారు. అదే విధంగా పట్టిపెరిగిన ఊరును సైతం మర్చిపోవద్దని అన్నారు. 17ఏళ్ల వ్యవధిలో ఈ దేశంలో ఉన్న అన్ని చట్టసభల్లో పనిచేశానని చెప్పారు. సక్సెస్ కావాలంటే ముఖ్యంగా పట్టుదల ఉండాలని అన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ తో పాటు చిత్తశుద్ధి ఉంటే జీవితంలో పైకి వస్తారని వ్యాఖ్యానించారు. మారుమూల అచ్చంపేట నియోజకవర్గంలో పుట్టిన తాను 2006లో జడ్పీటీసీగా గెలిచానని చెప్పారు. 2007లో ఎమ్మెల్సీగా, 2009, 2014లో ఎమ్మెల్యేగా, 2019లో పార్లమెంట్ సభయుడిగా, 2023లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యానని అన్నారు.






