షాబాద్ జెడ్పీహెచ్ఎస్ 1995-96 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

by Batti.Sumithra |

షాబాద్ జెడ్పీహెచ్ఎస్‌లో 1995-96 విద్యాసంవత్సరంలో చదివిన పూర్వవిద్యార్థులు ఆదివారం సంకేపల్లిగూడ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

షాబాద్ జెడ్పీహెచ్ఎస్ 1995-96 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
X

దిశ, షాబాద్ : షాబాద్ జెడ్పీహెచ్ఎస్‌లో 1995-96 విద్యాసంవత్సరంలో చదివిన పూర్వవిద్యార్థులు ఆదివారం సంకేపల్లిగూడ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కలుసుకున్న సహచరులు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత ఉపాధ్యాయులు జడల వీరస్వామి గౌడ్, లింగం, శ్రీనివాసరావు, శ్రీదేవి, రాఘవేంద్రరావు, కుమారస్వామి, జగదీశ్వర్, సుదర్శన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పూర్వ విద్యార్థులు తమ గురువులను ఘనంగా సన్మానించి, వారు అందించిన విద్యా బోధన, మార్గదర్శకత్వాన్ని కృతజ్ఞతతో స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందని, ఇలాంటి సమ్మేళనాలు స్నేహబంధాలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. అనంతరం పూర్వవిద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు, జ్ఞాపకాల పంచుకోలు, ఫొటో సెషన్‌లో పాల్గొని ఆత్మీయంగా గడిపారు.

Next Story