- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం దేశవ్యాప్తంగా నిపుణుల సేవలు
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మెరుగవడం కోసం, ఆయనకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు సమాచారం.

దిశ, వరంగల్ టౌన్: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మెరుగవడం కోసం, ఆయనకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు సమాచారం. వారి సమన్వయంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రి నుంచి ప్రముఖ కార్డియాక్ నిపుణులను సంప్రదించినట్లు తెలిసింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. దేశంలోని ప్రముఖ గుండె వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు చికిత్స కొనసాగిస్తున్నట్లు సమాచారం. వైద్యుల సమన్వయంతో అవసరమైన అన్ని ఆధునిక వైద్య విధానాలను అమలు చేస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ప్రార్థనలు చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ కేటీఆర్, హరీశ్ రావు వైద్యులతో సమీక్షిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.






