ప్రాంత విభేదాలు లేకుండా కడుపులో పెట్టుకుంటాం : ఎమ్మెల్యే

by Batti.Sumithra |

మినీ ఇండియాగా పేరు ఉన్న పటాన్ చెరు నియోజకవర్గంలో స్థిరపడ్డ పలు రాష్ట్రాల ప్రజలను కులం, మతం, ప్రాంతం విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

ప్రాంత విభేదాలు లేకుండా కడుపులో పెట్టుకుంటాం : ఎమ్మెల్యే
X

దిశ, పటాన్ చెరు టౌన్ : మినీ ఇండియాగా పేరు ఉన్న పటాన్ చెరు నియోజకవర్గంలో స్థిరపడ్డ పలు రాష్ట్రాల ప్రజలను కులం, మతం, ప్రాంతం విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో నియోజకవర్గలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోని, పటాన్ చెరుని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపడంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఆదివారం పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఓటర్లు, కార్మికులకు ఎస్ఐఆర్ అంశం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు.

ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఓటు హక్కు ఉండడం అత్యంత అవసరమని అన్నారు. ఓటు ఉన్నప్పుడే ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో పాటు.. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. అందుకని నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. పటాన్ చెరు భవిష్యత్తుకు ప్రతి ఓటు అత్యంత కీలకమని అన్నారు. అన్ని రాష్ట్రాల ప్రజల పండుగలను, పర్వదినాలను కలిసిమెలిసి నిర్వహిస్తూ ఈ ప్రాంతాన్ని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుపుతున్నామని తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఎస్ఐఆర్ అంశం పై అవగాహన కల్పించారు. ఇటీవల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నాయికోటి రాజును ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శంకర్ యాదవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, యాదగిరి యాదవ్, మెట్టు కుమార్ యాదవ్, బాల్ రెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అంతిరెడ్డి, రామచంద్ర రెడ్డి, నర్రా బిక్షపతి, పృథ్వీరాజ్, వివిధ రాష్ట్రాల ప్రజలు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story