- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అశ్వాపురం మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రావులపల్లి నరసింహారావు
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల సభ్యులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నియామక పత్రాలను అందజేశారు.

దిశ, అశ్వాపురం : తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల సభ్యులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నియామక పత్రాలను అందజేశారు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గద్దల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా రావులపల్లి నరసింహారావు నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా రావులపల్లి నరసింహారావు మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. దళితుల సంక్షేమం కోసం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ తన వంతు సేవ అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించిన టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గద్దల రమేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట లక్ష్మీ ప్రసన్న, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.






