FSSAI: వెస్ట్‌ఎండ్ ఆగ్రో లైసెన్స్ సస్పెండ్ చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ

by S Gopi |

తనిఖీల్లో తయారీ తేదీలు, గడువు తేదీలు, బ్యాచ్ నంబర్లను మార్చి ఉత్పత్తులను మళ్లీ లేబుల్ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

FSSAI: వెస్ట్‌ఎండ్ ఆగ్రో లైసెన్స్ సస్పెండ్ చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ వెస్ట్‌ఎండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు తీసుకుంది. భారీ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన కారణంగా కంపెనీ లైసెన్స్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. తనిఖీల్లో తయారీ తేదీలు, గడువు తేదీలు, బ్యాచ్ నంబర్లను మార్చి ఉత్పత్తులను మళ్లీ లేబుల్ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, తప్పుదారి పట్టించే బ్రాండింగ్, ఆర్గానిక్ వంటి తప్పుడు ప్రకటనలతో ఉత్పత్తులను మార్కెట్లోకి పంపుతున్నట్లు వెల్లడైంది. ఈ అక్రమాలకు ఉపయోగించిన ప్రింటింగ్ యంత్రాలు, స్టాంపులు, లేబుళ్లు, ప్యాకింగ్ మెటీరియల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌ఎండ్ ఆగ్రో ప్రొడక్ట్స్‌తో పాటు వెస్ట్‌ఎండ్ కార్పొరేషన్ కూడా ఒకే ప్రాంగణం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తనిఖీలో బయటపడింది. వినియోగదారులను మోసం చేసే విధంగా తప్పనిసరి లేబుల్ సమాచారాన్ని మార్చడం ప్రజారోగ్యానికి ప్రత్యక్ష ముప్పు అని పేర్కొంటూ, ఈ ఉత్పత్తులను ప్రాథమికంగా సురక్షితం కానివిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది.

Next Story