Nepal: నేపాల్‌లో రూ. 200, రూ. 500 నోట్లు చెల్లుతాయి

by S Gopi |

2016లో మనదేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత నేపాల్ రూ.100 కంటే ఎక్కువ విలువైన భారత కరెన్సీపై నిషేధం విధించింది.

Nepal: నేపాల్‌లో రూ. 200, రూ. 500 నోట్లు చెల్లుతాయి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దాదాపు పదేళ్ల తర్వాత భారతీయ కరెన్సీపై నేపాల్ కీలక నిర్ణయం ప్రకటించింది. ఇకపై భారతీయులు, నేపాలీ పౌరులు ఒక్కొక్కరు గరిష్టంగా రూ.25,000 విలువైన రూ.200, రూ.500 భారతీయ నోట్లను నేపాల్‌లోకి తీసుకెళ్లవచ్చు, అక్కడి నుంచి తీసుకురావచ్చు. 2016 నవంబర్ 9 తర్వాత జారీ చేసిన వాటికి అనుమతి ఉంటుంది. 2016లో మనదేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత నేపాల్ రూ.100 కంటే ఎక్కువ విలువైన భారత కరెన్సీపై నిషేధం విధించింది. తాజా నిర్ణయంతో ఆ ఆంక్షలకు కొంతమేర సడలింపు లభించింది. అయితే పాత డిజైన్‌లోని రూ.500, రూ.1,000 నోట్లు ఇప్పటికీ చెల్లవు. నేపాల్ రాష్ట్ర బ్యాంక్ (ఎన్ఆర్‌బీ) ఈ నిబంధనలను మరోసారి స్పష్టం చేస్తూ, నేపాలీ పౌరులు భారత్ మినహా ఇతర దేశాల నుంచి భారతీయ కరెన్సీ తీసుకురావద్దని, అలాగే భారత్ తప్ప వేరే దేశాలకు తీసుకెళ్లరాదని తెలిపింది. ఈ నిర్ణయం వల్ల భారత్–నేపాల్ మధ్య పర్యాటకం, సరిహద్దు వాణిజ్యం, ప్రజల రాకపోకలు మరింత సులభం కానున్నాయి. ముఖ్యంగా భారత్‌కు తరచూ వచ్చే నేపాలీ పౌరులు, నేపాల్‌కు వెళ్లే భారతీయ పర్యాటకులు, చిన్న వ్యాపారులకు ఇది అతిపెద్ద ఊరటగా మారనుంది.

Next Story